ఏమి చెయ్యాలో తెలియని ఆవేదన
ఏదో సాధించాలనే తపన
వేసే ప్రతి అడుగులో తడబాటు
చేసే ప్రతి ఆలోచనలో ఏదో కలవరపాటు
ఎటు వెళ్ళాలో తెలియని అయోమయం
ఏమౌతుందో అనే సందేహం
ఎప్పుడు కోలుకుంటానొ ఈ అంధకారం నుంచి
ఏనాటికి తీరుతుందో ఈ అలజడి
ఈ అనిశ్చితమే నా జీవితమంటే
లేక ఇదంతా కేవలం నా ఊహా ?
-- బాటసారి